![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసరవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -129 లో... కనకం, మీనాక్షి కలిసి సేటుని రూమ్ లో బంధిస్తారు. ఆ తర్వాత టెన్షన్ పడుతారు. అంతలోనే కృష్ణమూర్తి వస్తాడు. కనకం.. తడబడుతూ మాట్లాడుతుంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని కృష్ణమూర్తి అడుగుతాడు. దాంతో పక్కనే ఉన్న మీనాక్షి కవర్ చేస్తుంది. అంతలోనే అప్పు వస్తుంది. ఈ మామిడి కాయలు తీసుకెళ్లి స్వప్నకి ఇచ్చి రా ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు పుల్లటివి తినాలనిపిస్తుంది కదా అని అప్పుతో కృష్ణమూర్తి చెప్పి, స్వప్న దగ్గరికి పంపిస్తాడు.
మరొక వైపు సుభాష్, రాజ్ ఇద్దరు కలిసి కంపెనీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రాహుల్ వెళ్లిపోతుంటే.. రాజ్ ఆగమని చెప్తాడు. ఇక నువ్వు పబ్ లు, జల్సాలు మానేసి బుద్దిగా ఆఫీస్ కి రావాలని రాజ్ అంటాడు. ఏంటి ఎన్నడూ లేనిది ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావ్.. నువ్వే మాట్లాడుతున్నావా? ఎవరైనా మాట్లాడిస్తూన్నారా అని రాహుల్ అంటాడు. నాకు అనిపించింది మాట్లాడుతాను. ఎవరు చెప్పినా వినే మనిషిని కాదు. నీకు పెళ్లి అయింది. ఇప్పుడు కూడా నువ్వు బాధ్యతగా లేకుంటే ఎలా.. అందుకని రేపటి నుండీ ఆఫీస్ కి రా.. కొన్ని రోజులు నేను వెళ్లే బ్రాంచ్ కి నాతో రా అని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా విన్న రుద్రాణి.. నా కొడుకును తక్కువ చేసి మాట్లాడుతున్నారని అంటుంది. ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవీ.. ఎవరు నీ కొడుకుని తక్కువ చేసి మాట్లాడడం లేదు బాధ్యత గుర్తుచేస్తున్నారని అంటుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి.. రాహుల్ ఎంప్లాయిస్ డబ్బులు తీసుకున్నాడని, ఇంట్లో అందరితో చెప్పొచ్చు కదా అని కావ్య అంటుంది.
ఇంట్లో అందరి ముందు రాహుల్ ని దోషిగా నిలబెట్టడం ఇష్టం లేదని రాజ్ అంటాడు. మరొక వైపు అప్పు మామిడి కాయలు తీసుకొని దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ధాన్యలక్ష్మి అప్పుని చూసి లోపలికి రా కూర్చోమని చెప్పి.. కావ్యని తీసుకొని వెళ్తుంది. అప్పు సోపాపై కూర్చుంటే రుద్రాణి వచ్చి అలా కూర్చున్నవేంటి అంటూ అవమానిస్తుంది. అలా రుద్రాణి మాట్లాడేసరికి విసుగుచెందిన అప్పు.. మీలాగా ఇంట్లో పడి తినట్లేదు కదా అంటుంది. దాంతో రుద్రాణి కోపంతో అప్పు ని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. అంతలోనే ఇందిరాదేవి ఆపి రుద్రాణిని తిడుతుంది.
ఆ తర్వాత అప్పు తనని అన్న మాటలు చెప్పడంతో అందరూ రుద్రాణిని తిడతారు. శత్రువైనా సరే ఇంటికి వస్తే మర్యాద చెయ్యాలి. గౌరవం ఇవ్వాలని అపర్ణ అంటుంది. స్వప్న కూడా రుద్రాణికి సపోర్ట్ గా మాట్లాడి అప్పుని అవమానిస్తుంది. ఆ తర్వాత అప్పు తెచ్చిన మామిడికాయలు ఇస్తుంది. అయిన ఇవి నాకెందుకని స్వప్న అనగానే.. అందరూ షాక్ అవుతారు. కడుపుతో ఉన్న వాళ్లకి ఇవి తినాలనిపిస్తుంది కదా.. నువ్వు ఎందుకు అలా అంటున్నావ్ అని ఇందిరాదేవి అనగానే.. అవును నాకు తినాలనిపిస్తుంది అని స్వప్న కవర్ చేస్తూ మామిడికాయ తింటుంది. కాసేపటికి నేను నిన్ను డ్రాప్ చేస్తానులే అప్పు అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |